గొల్లపల్లిలో తానా ఉచిత వైద్య శిబిరం
తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ గోగినేని శ్రీనివాస సహకారంతో ఆయన స్వగ్రామం నూజివీడు నియోజకవర్గంలోని గొల్లపల్లిలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగాఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ విజయవాడ, టాప్ స్టార్స్ హాస్పిటల్ సహకారంతో ఉచిత క్యాన్సర్ ఇతర ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన తానా నేతలకు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గోగినేని శ్రీనివాసతో పాటు తానా తదుపరి అధ్యక్షులు శృంగవరపు నిరంజన్, తాళ్లూరి జయ శేఖర్, తానా కార్యదర్శి వేమూరి సతీష్, తానా ఫౌండేషన్ ట్రస్టీలు సామినేని రవి, విశ్వనాధ్ నాయనపాటి తదితరులు పాల్గొన్నారు.
Tags :