తానా సభల నిర్వహణకు చేయూతనిచ్చిన హ్యూస్టన్
హ్యూస్టన్‌లో తానా మహాసభల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు కాన్ఫరెన్స్ చైర్ నరేన్ కొడాలి తదితరులు హాజరయ్యారు. తానా మాజీ అధ్యక్షురాలు పద్మశ్రీ ముత్యాల, రాజా దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తానా అభిమానులు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో భేటీ అయిన సతీష్ వేమన వాషింగ్టన్ డీసిలో జరిగే తానా మహాసభలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరారు. టెక్సాస్ ప్రవాసులు పెద్ద సంఖ్యలోతరలివస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తానా మహాసభల ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను సతీష్ వేమన అందరికీ తెలియజేశారు. ఈ కాన్ఫరెన్స్ నిర్వహణకోసం నిధులు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ తానా కాన్ఫరెన్స్ నాయకుల తరపున సతీష్ వేమన, నరేన్ కొడాలి ధన్యవాదాలు తెలియజేశారు.
Tags :