అక్టోబర్ 4న విజయవాడలో తానా గిడుగు పురస్కార సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే తానా-గిడుగు రామమూర్తి తెలుగు భాషా పురస్కారంను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి. ఉమామహేశ్వరరావుకు అందజేయనున్నది. ఈ పురస్కార కార్యక్రమం విజయవాడలోని హోటల్ ఐలాపురంలో అక్టోబర్ 4వ తేదీన జరగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రధాన అతిధిగా విస్కాన్సిన్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొ. వెల్చేరు నారాయణరావు హాజరవుతారని తానా నాయకులు తెలిపారు. తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి గిడుగు రామమూర్తి పురస్కారాన్ని ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావుకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సామల రమేష్ బాబు అధ్యక్షత వహించనున్నారు. వాసిరెడ్డి నవీన్ స్వాగతం పలకనున్నారు.
Tags :