వెల్‍స్టార్ హాస్పిటల్ లో తానా సేవా కార్యక్రమం
జార్జియా రాష్ట్రంలో ప్రముఖమైన పెద్దదైన వెల్‍స్టార్ హాస్పిటల్ సిబ్బంది కోవిడ్ 19 పేషంట్లకు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ తానా అట్లాంటా నాయకులు డిన్నర్ ఏర్పాటు చేశారు. డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి డిన్నర్ ఇచ్చారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్‍లైన్ సిబ్బంది సేవలను ఈ సందర్భంగా తానా నాయకులు అభినందిస్తూ, తమ సేవలకు అనుమతి ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు ఆధ్వర్యంలో వినయ్ మద్దినేని, శ్రీనివాస్ లావు, శ్రీరామ్ రొయ్యల, అనిల్ యలమంచిలి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. నగేశ్ దొడ్డాక కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
Tags :