అలెన్‍టౌన్ లో తానా లంచ్ బాక్స్ లు పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో పెన్సిల్వేనియాలోని అలెన్‍టౌన్‍లో ఫ్రంట్ లైన్ సిబ్బందికి లంచ్ బాక్స్ లను పంపిణీ చేశారు. కోవిడ్19 పేషంట్లకు వారు చేస్తున్న ట్రీట్‍మెంట్‍కు కృతఙతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా నాయకులు తెలిపారు. అప్పర్ మెకుంగి పోలీస్ విభాగం ఆఫీసర్లకు లంచ్‍ను అందజేశారు. లెహి వ్యాలీ మెడికల్ ఐసియు ఆరోగ్య సిబ్బందికి లంచ్‍ను పంపిణీ చేశారు. దాదాపు 40 హెల్త్ కేర్ సిబ్బందికి ఇచ్చారు. ఈ?సందర్భంగా సిబ్బంది తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా అధ్యక్షులు జయ్ తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, సతీష్ చుండ్రు తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా అలెన్‍టౌన్ సిటీ కో ఆర్డినేటర్ మోహన్ మల్ల తెలిపారు.
Tags :