ASBL Koncept Ambience

ఎక్స్ టన్ లో మెడికల్ సిబ్బందికి తానా సేవలు

ఎక్స్ టన్ లో మెడికల్ సిబ్బందికి తానా సేవలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కోవిడ్‍ 19 పేషంట్లకు విశేషంగా సేవలందిస్తున్న ఫ్రంట్‍లైన్‍ సిబ్బందిని అభినందిస్తూ వివిధ నగరాల్లో తానా నిర్వహిస్తున్న ప్రశంసా కార్యక్రమాల్లో భాగంగా ఫిలడెల్ఫియాలోని ఎక్స్ టన్ లో ఉన్న మైన్‍లైన్‍ హెల్త్ సెంటర్‍ సిబ్బందికి మిడ్‍ అట్లాంటిక్‍ తానా టీమ్‍ ఆధ్వర్యంలో లంచ్‍ను ఇచ్చారు. మే 21వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తానా నాయకులు పాల్గొన్నారు. నాగరాజు నలజుల, బాలు కరి, ఫణికంతేటి, కోటి యాగంటి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, మిడ్‍ అట్లాంటిక్‍ ఆర్‍విపి సతీష్‍ చుండ్రు ప్రోత్సాహంతో తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తానా నాయకులు తెలిపారు.

 

Tags :