ఫిలడెల్ఫియాలో మెడికల్ సిబ్బందికి లంచ్ బాక్స్ లు ఇచ్చిన తానా
కోవిడ్ 19 వైరస్‍తో ఇబ్బందులు పడుతున్న పేషంట్లకు ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న మెడికల్ సిబ్బందికి కృతఙత సూచకంగా తానా ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియా ఉన్న మెడికల్ సిబ్బందికి లంచ్ బాక్స్ లను పంపిణీ చేశారు. ఐన్‍స్టీన్ మెడికల్ సెంటర్ స్టాఫ్‍కు లంచ్ బాక్స్ లు అందజేసినట్లు ఫిలడెల్ఫియా తానా నాయకుడు సురేష్ యలమంచి తెలిపారు. తానా కార్యదర్శి రవి పొట్లూరి, రీజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ చుండ్రు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు. తమకు బాక్స్ లు అందించిన తానాకు పలువురు మెడికల్ సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించిన ఫిలడెల్ఫియా టీమ్‍కు రవి పొట్లూరి అభినందనలు చెప్పారు.
Tags :