ASBL Koncept Ambience

తానా హారీస్‍బర్గ్ టీమ్ ఆధ్వర్యంలో లంచ్ బాక్స్ ల పంపిణీ

తానా హారీస్‍బర్గ్ టీమ్ ఆధ్వర్యంలో లంచ్ బాక్స్ ల పంపిణీ

కోవిడ్‍ 19 సంక్షోభం సమయంలో విశిష్ట సేవలందిస్తున్న ఫ్రంట్‍లైన్‍ సిబ్బందిని అభినందిస్తూ ఉత్తర అమెరికా తెలుగు సంఘం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా హారీస్‍బర్గ్ టీమ్‍ ఆధ్వర్యంలో పరివార్‍ ఇండియన్‍ రెస్టారెంట్‍ నుంచి తెచ్చిన లంచ్‍బాక్స్ లను హెర్షే హాస్పిటల్‍లో పంపిణీ చేశారు. కోవిడ్‍ 19 నుంచి రక్షణకోసం ఫేస్‍ షీల్డస్ ను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది తానా హారీస్‍బర్గ్ టీమ్‍కు ధన్యవాదాలు తెలిపారు. డా. వంశీ జక్కంపూడి సహకారంతో తాముఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హారీస్‍బర్గ్ తానా నాయకులు తెలిపారు.

తానా అధ్యక్షుడు జయ్‍ తాళ్ళూరి, పాస్ట్ ప్రెసిడెంట్‍ సతీష్‍ వేమన, బోర్డ్ చైర్మన్‍ హరీష్‍ కోయ, ఇవిపి అంజయ్య చౌదరి లావు, సెక్రటరీ రవి పొట్లూరి, ఫౌండేషన్‍ సెక్రటరీ రవి మందలపు తదితరుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినట్లు చెప్పారు. సాంబశివ అంచ, శశిధర్‍ జాస్తి, వెంకటేశ్వరరావు సింగు, వెంకట యార్లగడ్డ, వెంకట్‍ గోపీనాథ్‍ చిమ్మిలి, వెంకట సుబ్బారావు ముప్పా, సాంబశివ నిమ్మగడ్డ, శ్రీనివాస్‍ కోట తదితరుల ఈ కార్యక్రమం విజయవంతానికి తోడ్పడ్డారు. ఉమేష్‍ చెల్లప్ప, చైతన్య అమర్‍నాథ్‍ మన్నె కార్యక్రమానికి స్పాన్సర్‍గా వ్యవహరించారు. కార్యక్రమాన్ని సక్సెస్‍ చేసినందుకు హారీస్‍బర్గ్ టీమ్‍ను మిడ్‍ అట్లాంటిక్‍ తానా ఆర్‍విపి సతీష్‍ చుండ్రు అభినందించారు.

 

Tags :