ASBL Koncept Ambience

తానా ఎన్నికలలో నన్ను పోటీ చేయనియ్యకుండా నాకు అన్యాయం చేశారు...భక్తబల్లా

తానా ఎన్నికలలో నన్ను పోటీ చేయనియ్యకుండా నాకు అన్యాయం చేశారు...భక్తబల్లా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో నరేన్‌ వర్గం తరపున కార్యదర్శి పదవికి భక్తబల్లా వేసిన నామినేషన్‌ తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించిన తరువాత దీనిపై భక్తబల్లా తనకు న్యాయం చేయాలంటూ తానా బోర్డ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. తరువాత దీనిపై బోర్డ్‌ కూడా స్పందిస్తూ ఎన్నికల కమిటీ సరైన నిర్ణయే తీసుకుందని, దీనిపై మరో నిర్ణయానికి తావులేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో భక్తబల్లా తెలుగు టైమ్స్‌తో మాట్లాడుతూ, తన విషయంలో జరిగిన అన్యాయాన్ని ఈ విధంగా వివరించారు.

తానా అనేది నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌. తానా బోర్డ్‌ అనేది సభ్యుల హక్కుల రక్షణకు, తానా కార్యక్రమాల నిర్వహణను సరైన దిశలో నడిపేందుకు ఏర్పడింది. తానాలో ప్రతి సభ్యునికి ప్రాథమిక హక్కుగా ఉన్న పని చేసే హక్కును కాపాడాల్సిన బాధ్యత బోర్డ్‌ మీద ఉంది. నేను (భక్తబల్లా) 14వ తేదీన రాజీనామా లేఖను పంపాను. 21వ తేదీన నా రాజీనామాను ఆమోదించినట్లు బోర్డ్‌ తెలియజేసింది. నామినేషన్ల పరిశీలన గడువు 23వ తేదీ నాటికే నా రాజీనామా ఆమోదం పొంది ఉంది. ఈ నేపథ్యంలో 24వ తేదీన నా నామినేషన్‌ చెల్లదని ఎన్నికల కమిటీ ప్రకటించింది. దీనిపై నేను బోర్డ్‌కు నిబంధనలను పేర్కొంటూ ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని కోరుతూ లేఖ రాశాను. న్యాయ పెద్దంగా ఎన్నికల సంఘం ఎన్నికల నామినేషన్ పత్రాలు చూసే సమయానికి నా పూర్వపు పదవి కి చేసిన రాజీనామా ఆమోదం పొందింది కాబాబట్టి నా నామినేషన్ తిరస్కరించటం సరి కాదు.  అంతే  కాదు ..  నామినేషన్ల దాఖలు చేసే సమయంలో, ఆ తరువాత కూడా అమెరికా లో  కోల్డ్ వేవ్  వుంది.. టెక్సాస్‌ లాంటి రాష్ట్రాలలో వాతావరణం భయంకరంగా ఉంది. అందువల్ల పోస్టల్‌ బట్వాడాలు ఆలస్యంగా వెళ్లాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా నామినేషన్‌ టెక్నికల్‌గా చెల్లదంటూ చెప్పడం న్యాయం కాదు. బోర్డ్‌ పక్షపాతం లేకుండా, ఇతర విషయాలను కూడా పరిశీలించి నాకు న్యాయం చేసి ఉండాలి. కాని అలా జరగలేదు. బోర్డ్‌ పక్షపాతంతో వ్యవహరించినట్లు కనిపిస్తోంది.

నాకు తెలిసిన సమాచారం ప్రకారం గతంలో ఓ సభ్యుడు పెట్టిన వీడియో ఆరోపణలపై ఇప్పటికే తానా కోర్టులో కేసు వేసి వాదిస్తోంది. తానా డబ్బులను ఇందుకోసం ఖర్చు చేస్తోంది. నేను కూడా కోర్టుకు వెళితే తానా సంస్థ డబ్బులను కోర్టుకే వెచ్చిస్తుంది. అది నాకిష్టం లేదు. అందుకే కోర్టుకు వెళ్ళను. కాని నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది.

నేను 2015-17, 2017-19 సంవత్సరంలో రెండుసార్లు కార్యదర్శి పదవికి పోటీ చేశాను. రెండుసార్లు ఓడిపోయాను. తరువాత 2019-21 ఎన్నికల సమయంలో ట్రస్టీగా నామినేషన్‌ వేశాను. అప్పుడు ట్రస్టీ పదవులు 5 ఉంటే, ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికకోసం తానా డబ్బులు ఖర్చుకాకుండా చూడటం కోసం నేను అప్పుడు నా నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటానని చెప్పాను. కాని అప్పటి పెద్దలు నా  సర్వీసేస్ తానాకు కావాలని చెప్పి, వేరేవాళ్ళచేత నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. నాకు అప్పగించిన బాధ్యతలను నేను సక్రమంగా నెరవేర్చాను. తానాకోసం, కమ్యూనిటీకోసం ఎల్లప్పుడూ పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను.

ఇప్పటికైనా ఈ ఎన్నికల సమయంలో టెక్నికల్‌ పాబ్లమ్స్‌ పేరుతో నా నామినేషన్‌ను తిరస్కరించడం బాధగా ఉంది. ఈ విషయంలో మరోమారు ఆలోచించుకోవాలని కోరుతున్నాను.

 

Tags :