కంకిపాడులో 'తానా' వైద్యశిబిరానికి మంచి స్పందన
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా), బోడె ప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంకిపాడు మార్కెట్ యార్డ్‌లో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరానికి మంచి స్పందన లభించింది. దాదాపు 500 మందికి సాధారణ, గుండె, నేత్ర, దంత సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేశారు. మణిపాల్ (విజయవాడ), లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి (పాలకొల్లు), కామినేని ఆసుపత్రి (విజయవాడ), డెంటీస్ దంతవైద్యశాల (విజయవాడ)కు చెందిన వైద్యులు, సిబ్బంది ఈ వైద్యశిబిరంలో సేవలందించారు. తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన, తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ గోగినేని, తానా ప్రతినిధులు రాజేష్ అడుసుమిల్లి, అనిల్ యలమంచిలి, అంజయ్యచౌదరి లావు, కె. చలపతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags :