మిర్తిపాడులో 'తానా' ఉచిత కంటి వైద్యశిబిరం
మిర్తిపాడులో తానా ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించారు. 'మన ఊరికోసం' కార్యక్రమంలో భాగంగా మిర్తిపాడు జడ్‌పి హైస్కూల్‌లో జరిగిన ఈ శిబిరాన్ని తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఎంపి మురళీ మోహన్ ప్రారంభించారు. రాజమహేంద్రవరానికి చెందిన 12 మంది కంటివైద్య నిపుణులు ఈ శిబిరంలో సుమారు 250 మందికి కంటి పరీక్షలు జరిపారు. ఈ శిబిరంతోపాటు విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక అవగాహన సదస్సును కూడా నిర్వహించారు. బల్బులు, సోలార్ ల్యాంప్‌లు, రోబోలు, సెల్‌ఫోన్‌లో సిమ్‌కార్డ్ పనిచేసే విధానం వంటి వాటిని వివరించారు. ఎంపి గరికపాటి మోహన్ రావు, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన, కో ఆర్డినేటర్లు సుధాకర్ కొర్రపాటి, రాజేష్ అడుసుమిల్లి, సౌతాఫ్రికా తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు శేఖర్, కువైట్ తెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు దివాకర్, జడ్‌పి హైస్కూల్ స్థల దాత జాగర్లపూడి లక్ష్మీ, హెచ్‌ఎం రామ రజని తదితరులు పాల్గొన్నారు.