ASBL Koncept Ambience

ఖమ్మంలో 'తానా' కార్యక్రమాలకు మంచి స్పందన

ఖమ్మంలో 'తానా' కార్యక్రమాలకు మంచి స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమాలకు మంచి స్పందన వచ్చింది. హ్యాపీ ఖమ్మం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది పాల్గొన్నారు. రోటరీ క్లబ్‌ సహకారంతో జరిగిన హ్యాపీ ఖమ్మం, హెల్తీ మారథాన్‌లో పాల్గొన్న పలువురు ప్రముఖులు తానా కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేశారు. పెవిలియన్‌ గ్రౌండ్‌ నుంచి లకారం ట్యాంక్‌ బండ్‌ వరకు సైకిల్‌ మారథాన్‌ను చేపట్టారు. అనంతరం లకారం ట్యాంక్‌బండ్‌పై ఆరోగ్యం పట్ల అవగాహన కోసం యోగా, ఏరోబిక్‌, డాన్స్‌, డీజే, సాంస్క తిక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ హ్యాపీ ఖమ్మం కార్యక్రమానికి పువ్వాడ అజయ్‌కుమార్‌, రసమయి బాలకిషన్‌, సినీనటులు శివ బాలాజీ, జ్యోతి తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్‌, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌జయశేఖర్‌ తాళ్ళూరి. కార్యదర్శి లావు అంజయ్య చౌదరి, కోశాధికారి పొట్లూరి రవి, కొంద్రగుంట చలపతి, బత్తిన రాకేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :