ASBL Koncept Ambience

న్యూజెర్సిలో మెడిటేషన్ పై తానా సదస్సు విజయవంతం

న్యూజెర్సిలో మెడిటేషన్ పై తానా సదస్సు విజయవంతం

న్యూజెర్సిలో తానా ఆధ్వర్యంలో పిరమిడ్‌ స్పిర్చువల్‌ సొసైటీస్‌ మూవ్‌మెంట్‌ (పిఎస్‌ఎస్‌ఎం) నిర్వహించిన మెడిటేషన్‌, విస్‌డమ్‌ సెషన్‌ విజయవంతమైంది. బ్రహ్మశ్రీ పితామహ పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది హాజరయ్యారు. మెడిటేషన్‌ ప్రాధాన్యతను ఆయన వివరించారు. ఈ సందర్భంగా మెడిటేషన్‌ చేసిన తరువాత ఎంతోమంది తమకు కలిగిన అనుభూతిని వివరిస్తూ తాము ఇప్పుడు ఎంతో రిలాక్స్‌ అయ్యామని చెప్పారు. ఇక ముందు కూడా మెడిటేషన్‌ చేస్తామన్నారు.  మెడిటేషన్‌ ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియజేయడానికి తానా సహకరిస్తుందని ఈ సందర్భంగా తానా నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వేదికను ఇచ్చిన రత్నమూల్పూరికి తానా నాయకులు ధన్యవాదాలు తెలిపారు. శ్రీనివాస్‌ ఓరుగంటి, లలిత నెక్కంటి, శ్రీధర్‌ దోనెపూడి, భగవాన్‌, శివాని తానా, సూర్య చక్క, దేవి చక్క, దివ్య తదితరులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. విద్యాగారపాటి, సుధీర్‌ నారెపాలెపు, శ్రీ చౌదరి కొనంకి, సుబ్రహ్మణ్యం ఓసూరు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు.

Click here for Event Gallery

 

Tags :