ASBL Koncept Ambience

తానా సమర్పిస్తున్న శ్రీకృష్ణ తత్వం 23న

తానా సమర్పిస్తున్న శ్రీకృష్ణ తత్వం 23న

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య వేదిక సమర్పిస్తున్న శ్రీకృష్ణ తత్వం కార్యక్రమం ఆగస్టు 23వ తేదీన న్యూయార్క్‌లోని మెల్‌విల్లేలోని 1లాట్టిస్‌ సీటీలో రాత్రి 7 గంటలకు జరగనున్నట్లు తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి తెలిపారు. ప్రముఖ అవధాని, సాహితీవేత్త, ప్రవచనకర్త డా. మేడసాని మోహన్‌ శ్రీకృష్ణతత్వంపై ప్రసంగించనున్నారని, ఈ కార్యక్రమానికి అందరూ రావాలని జే తాళ్ళూరి కోరారు. వచ్చినవారందరికీ డిన్నర్‌ ఏర్పాట్లు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి వివరాలకోసం ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌ శిరీష తూనుగుంట్ల (904 294 5655), రీజినల్‌ కో ఆర్డినేటర్‌ (న్యూయార్క్‌) సుమంత్‌ రామ్‌సెట్టి 917 399,0459, శైలజ చల్లపల్లిని 917 275 5139లో సంప్రదించవచ్చు.

 

Tags :