ASBL Koncept Ambience

తానా వనభోజనాలకు రండి...

తానా వనభోజనాలకు రండి...

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియా టీమ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజనాలకు అందరూ రావాల్సిందిగా తానా టీమ్‌ ఓ ప్రకటనలో కోరింది. సెప్టెంబర్‌ 29వ తేదీన ఫిలడెల్ఫియాలోని కాలేజ్‌ విల్లే, ఎవాన్స్‌బర్గ్‌ స్టేట్‌ పార్క్‌లో ఈ వనభోజనాలను ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలకోసం ఆటలపోటీలను కూడా నిర్వహిస్తున్నారు. వాలీబాల్‌, అంత్యాక్షరీ, మ్యూజికల్‌ చైర్‌ ఇలా ఎన్నో పోటీలను ఏర్పాటు చేశామని, అందరూ కుటుంబసమేతంగా వచ్చి విందు భోజనాన్ని ఆరగించాల్సిందిగా తానా నాయకులు కోరారు. మీరు కూడా మీ స్పెషల్‌ వంటకాలను తీసుకురావచ్చని, అందరికీ నచ్చితే బహుమానాన్ని కూడా తీసుకోవచ్చని కూడా తానా నాయకులు తెలిపారు.

Tags :