డిసెంబర్ 16న హైదరాబాద్ శిల్పకళావేదికలో తానా కళారాధన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 16న హైదరాబాద్ శిల్పకళావేదికలో తానా కళారాధన కార్యక్రమం నిర్వహించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా అతిరధమహారథుల సమక్షంలో తెలుగు వైభవానికి పట్టం కట్టే ఈ వేడుకకు అందరికీ ఆహ్వానం. ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా రంగంలో విశిష్ట సేవలందించిన దిగ్గజాలకు పురస్కారాలు అందజేస్తామని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన సుశీల, సరోజా దేవి, దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్, కోట శ్రీనివాసరావు, సీనియర్ నటులు కృష్ణవేణి, జమున, లక్ష్మీ, మురళీమోహన్, గిరిబాబు, ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులను ఈ సందర్భంగా సత్కరించనున్నామని తానా 23వ మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి, చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్ పి.సునీల్ తెలిపారు.
Tags :