ASBL Koncept Ambience

కొలంబస్‌లో తానా కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌ విజయవంతం... విరాళాల వెల్లువ

కొలంబస్‌లో తానా కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌ విజయవంతం... విరాళాల వెల్లువ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు ఫిలడెల్ఫియాలో జూలై 7 నుంచి 8,9వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తానా మహాసభల కిక్‌ ఆప్‌ ఈవెంట్‌ను ఒహాయోలోని కొలంబస్‌లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరితోపాటు పలువురు తానా నాయకులు పాల్గొన్నారు. ఈ కిక్‌ ఆఫ్‌ ఈవెంట్‌ను తానా మాజీ బోర్డ్‌ డైరెక్టర్‌, తానా కన్వెన్షన్‌ కార్పొరేట్‌ చైర్‌ జగదీష్‌ ప్రభల సమన్వయంతో విజయవంతంగా జరిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 120 మందికిపైగా దాతలు,  స్పాన్సర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా  100,000 డాలర్లను విరాళంగా సేకరించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు చైతన్యశర్మ, వారి బృందం తానా నాయకులకు మరియు కన్వెన్షన్‌ బృందానికి ఆశీర్వాదాలు అందించారు. యునైటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ గ్రూప్‌ సిఇఓ అంజు వల్లభనేని కన్వెన్షన్‌ కోసం 25000 డాలర్లను విరాళంగా అందించారు. బాలాజీ యడ్డం సిఇఓ, జగదీష్‌ ప్రభల గ్లోబల్‌ హెడ్‌ మరియు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ( గ్లోబల్‌ కంపెనీ), మంజీర పాలడుగు కూడా తానాకు  25000 డాలర్లు విరాళంగా ఇస్తానని హామి ఇచ్చారు.

ఇఆర్‌పి అనలిస్ట్‌, సిఇఓ శ్రీకాంత్‌ గడ్డం రెడ్డి, గతి టెక్నాలజీస్‌ వంశీ కోరా యొక్క శంకర్‌ మంగాపురం సిఇఓ స్ట్రాటఫిక్‌ సిస్టమ్స్‌ మరియు ఇతర స్థానిక వ్యాపార సంస్థలకు చెందిన ప్రముఖులు కన్వెన్షన్‌కు మద్దతుగా విరాళాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కన్వెన్షన్‌ కోఆర్డినేటర్‌ రవి పొట్లూరి, డెట్రాయిట్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్‌ దుగ్గిరాల, మీడియా చైర్‌ శ్రీ అట్లూరి, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రవి సామినేని, కమిటీ సభ్యులు శివచావా, శ్రీకాంత్‌ మునగాల, వేణు చావా, సత్య బండారు, సిద్ధార్థ రేవూరు, కాళీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏషియన్‌ ఇండియన్‌ అలయన్స్‌ (ఎఐఎ), ప్రెసిడెంట్‌ సంజయ్‌ సదానా, వారి బృందం కూడా తానా మహాసభలకు తమ మద్దతును ప్రకటించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఐఎ) చైర్మన్‌ రామకృష్ణ కాసర్ల, మాజీ అధ్యక్షుడు రజనీకాంత్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఆంధ్రా పీపుల్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఒహాయో (ఆప్కో) అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, మన్నె నాగేశ్వరరావు, మురళి పుట్టి, సంగ శ్రీనివాస్‌, ట్రస్టీలు వేణు తలసిల, శ్రీధర్‌ వర్మ, వేణు పసుమర్తి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో టాకో నాయకులు ప్రదీప్‌ చందనం, తేజో వట్టి, గణేష్‌ వత్యం, వెంకట్‌ పత్తిపాటి, శ్రీకాంత్‌ మునగాల, జగన్‌ చలసానితోపాటు, కొలంబస్‌ తెలంగాణ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌ మధు కమిటీ సభ్యులు కూడా పాల్గొని తానాకు మద్దతు ప్రకటించారు. గీతాంజలి నుండి ప్రముఖ కల్చరల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకులు భరత్‌ జటప్రోలు మరియు కీర్తి కూడా చేరి మద్దతు ప్రకటించారు. సిడబ్ల్యూసిసి కొలంబస్‌ మహిళా కమిటీ అధ్యక్షురాలు అనూష కొప్పుల నుండి శ్రీమతి బాబు మాగంటి, శ్రీశాంతి పసుమర్తి, ఆమె బృందం కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. 

మంజూష ప్రభల, విక్రమ్‌ ప్రభల, ఫణి కప్ప, అశ్విన్‌ వేమూరి, కిషోర్‌ దోనేపూడి, శ్రీనివాస్‌ పోలిన, దుర్వాసుల శాస్త్రి, మనోహర్‌ నాయుడు, వల్లభ తేజ, నవీన్‌ నందమూరి, జానకి బెల్లాన, శ్రీమతి సంధ్య, వినోద్‌ కోసికె, సత్య యర్రంశెట్టి కుటుంబ సభ్యులు, హనుమాన్‌ తాడిపర్తి మరియు అనేక మంది స్థానిక తానా అభిమానులు ఇతరులు పాల్గొన్నారు. రుచికరమైన బఫే అందించిన దావత్‌ రెస్టారెంట్‌ యజమాని టిపి రెడ్డి మరియు అతని బృందానికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Photogallery

 

 

Tags :