ASBL Koncept Ambience

నాకు గురువు, దైవం అన్నీ సీనియర్ ఎన్టీఆరే : రాజేంద్ర ప్రసాద్

నాకు గురువు, దైవం అన్నీ సీనియర్ ఎన్టీఆరే : రాజేంద్ర ప్రసాద్

తెలుగు సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటులు ‘నట కిరీటి’ రాజేంద్ర ప్రసాద్. ఆయన్ను కూడా తానా మహాసభల వేదికపై సన్మానించడం జరిగింది. తనదైన స్టైల్‌లో విజిల్ వేసి ప్రసంగం మొదలు పెట్టిన రాజేంద్ర ప్రసాద్.. ‘తానా మహాసభల్లో ఇంత మంది తెలుగు వారిని చూసి ఆశ్చర్యపోయా. అమెరికాలో ఇంత మంది తెలుగు వాళ్లు ఉన్నారని చూస్తే చాలా గర్వంగా ఉంది’ అని చెప్పారు. తన కెరీర్‌లో కొత్త కొత్త పాత్రలు దక్కాయని అన్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఇంట్లోనే తను పుట్టానని, ఆ మహానుభావుని వల్లనే ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరానని గుర్తుచేసుకున్నారు. ‘అందరూ తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. నాకు గురువు, దైవం సీనియర్ ఎన్టీఆరే. నీకంటూ ట్రెండ్ సృష్టించుకొని, ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నావ్ అని ఆ పెద్దాయన చెప్పడం నా జీవితం ధన్యమైందని ఫీలయ్యా’ చెప్పుకొచ్చారు. తనకు ఇలాంటి అవకాశం కల్పించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కోఆర్డినేటర్ రవి పొట్లూరి, మిగతా తానా టీంకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

Tags :