ASBL Koncept Ambience

తానా మహాసభల వేదికపై డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డికి సన్మానం

తానా మహాసభల వేదికపై డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డికి సన్మానం

తానా 23వ మహాసభల రెండో రోజు కూడా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రముఖ వైద్యులు, ప్రైమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారిని తానా నాయకులు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రేమ్ సాగర్ రెడ్డి.. ‘నాకు 46 ఆస్పత్రులు ఉన్నాయని, అమెరికాలో మెడికల్ కాలేజీ ఉందని అందరూ చెప్తారు. కానీ నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా ఊళ్లో కనీసం కరెంట్, మంచి నీటి కుళాయి సౌకర్యం కూడా ఉండేది కాదు. కిరోసిన్ దీపం వెలుగులో చదువుకున్నా. అక్కడ మెడిసిన్ చదువుకొని, యాభై ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాను’ అని చెప్పారు. అలాగే ఇప్పుడు అమెరికాకు వస్తున్న యువతకు కూడా ఆయన సందేశం ఇచ్చారు. ‘మనకు ఒక ఐడెంటిటీ, విలువలు నేర్పినందుకు మాతృభూమికి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ముఖ్యంగా కుటుంబ విలువలు అక్కడే తెలుస్తాయి. ఇక అమెరికా చాలా దేశాల కన్నా సహనం కలిగిన దేశం. ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. మనం ఎగిరేందుకు అవసరమైన రెక్కలు ఇస్తుంది. మన కలలు నెరవేర్చుకునే అవకాశం ఇస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంటుంది. మీరు కూడా గొప్ప విజయాలు సాధించాలి’ అని కోరుకున్నారు.

అలాగే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని కూడా తానా నేతలు సత్కరించారు. ఈ తానా వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయని, ఇంత గొప్పగా వేడుకలు నిర్వహిస్తున్న తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కోఆర్డినేటర్ రవిపొట్లూరి అండ్ టీంకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

 

 

Tags :