తానా వేదికపై మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు సత్కారం
అగ్రరాజ్యంలో తానా 23వ మహాసభలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ వేదికలపై మాజీ శాసన సభ్యులు అరుమిల్లి రాధాకృష్ణ, మాజీ జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ గోని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, జయలక్ష్మి అన్నాబత్తుల తదితరులను తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవిపొట్లూరి సత్కరించారు. ఈ క్రమంలోనే మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ దంపతులను కూడా తానా నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘తానా అనేది తెలుగు వారందరికీ ఒక ఇల్లు వంటిది. పండుగల కోసం ఇంటికి వెళ్లినట్లే.. ప్రతి రెండేళ్లకు ఓసారి తెలుగు వాళ్లంతా తానా మహాసభలు జరుపుకుంటారు. కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు తానా చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేం’ అని చెప్పారు.
Tags :