తానా మహాసభలకు రండి...
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు ఫిలడెల్పియాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ మహాసభలకు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, ఇండియా వ్యవహారాల డైరెక్టర్ వంశీ కోట, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, ప్రసాద్ గారపాటి, కార్పొరేట్ స్పాన్సర్ షిప్ చైర్ జగదీష్ ప్రభల, సుబ్రహ్మణ్యం ఓసూరు, ముప్పా రాజశేఖర్ తదితరులు కలుసుకుని స్వయంగా ఆహ్వానిస్తున్నారు.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. రమణను, హైదరాబాద్ 9వ నిజాం నవాబ్ రౌనఖ్ ఖాన్‌ను, తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపిలు సంతోష్ కుమార్, వినోద్ కుమార్, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులను తానా నాయకులు కలుసుకుని ఆహ్వానించారు.