తానా మహాసభలకు ముఖ్య అతిధిగా వస్తున్న బాలకృష్ణ
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య అతిధిగా సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి హైదరాబాద్‌లో బాలకృష్ణను స్వయంగా కలిసి తానా మహాసభల ఆహ్వానపత్రాన్ని అందించి ఆహ్వానించారు. తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను, తెలుసుకుని తానా నాయకులను బాలకృష్ణ అభినందించారు. డిసెంబర్ 2022లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కోటి రూపాయల విరాళాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
Tags :