శ్రీ వేంకటేశ్వరస్వామి దీవెనలు తీసుకున్న తానా నాయకులు
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తానా 23వ మహాసభలు ఘనంగా మొదలయ్యాయి. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తానా 23వ కాన్ఫరెన్స్ ప్రారంభ సమావేశానికి ముందు కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ శ్రీ రవి పొట్లూరి, ఇతర తానా నాయకులు వేంకటేశ్వర స్వామి దీవెనలు తీసుకొన్నారు. న్యూ జెర్సీ నగరంలో ఎడిసన్‌లో ఉన్న శ్రీ సాయి దత్త పీఠం నుంచి శ్రీ రఘు శంకరమంచి గారు, విజయవాడ దుర్గ గుడి నుంచి వచ్చిన శ్రీ శంకర శాండిల్యలు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అందర్నీ ఆశీర్వదించారు.
Tags :