తానా సాహిత్యవేదిక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. ఇందులో భాగంగా సాహితీ ప్రియుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సిరివెన్నెల స్మృతిలో పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో చేంబోలు పద్మావతి, చేంబోలు సాయి వెంకట యోగీశ్వర శర్మ, డా. ప్రసాద్ తోటకూర, చేంబోలు శ్రీరామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, కిరణ్ ప్రభ, జీడిగుంట విజయసారధి, డా. కొండా వెంకట్, డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, చిగురుమళ్ల శ్రీనివాస్ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సిరివెన్నెల సమగ్ర సాహిత్యం సినిమాపాటలు (4 సంపుటాలు), సినిమాయేతర సాహిత్యం (2 సంపుటాలు)ను ఆవిష్కరించనున్నారు. సిరివెన్నెల సాహితీ సమాలోచన పేరుతో మరో కార్యక్రమాన్ని కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు.