ASBL Koncept Ambience

తానా మహాభారత ప్రవచనాలు 25న

తానా మహాభారత ప్రవచనాలు 25న

న్యూజెర్సిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో మహాభారతంపై ప్రవచన కార్యక్రమాన్ని స్థానిక తెలుగు సంఘం న్యూజెర్సి తెలుగు కళాసమితి, సాయిదత్తపీఠంతో కలిసి ఆగస్టు 25వ తేదీన ఏర్పాటు చేశారు. ప్రముఖ సహస్రావధాని, సాహితీవేత్త డా. మేడసాని మోహన్‌ మహాభారతంలోని సభాపర్వంపై కర్త, కర్మ, క్రియ పేరుతో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 నుంచి 7 వరకు ఈ ప్రవచన కార్యక్రమం ఉంటుందని తానా అధ్యక్షుడు జే తాళ్లూరి, ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌ లక్ష్మీదేవినేని, న్యూజెర్సి రీజినల్‌ కో ఆర్డినేటర్‌ రాజా కసుకుర్తి తెలిపారు.

 

Tags :