ASBL Koncept Ambience

తెలుగు రాష్ట్రాల్లో తానా మాస్క్ ల పంపిణీ

తెలుగు రాష్ట్రాల్లో తానా మాస్క్ ల పంపిణీ

కరనా వైరస్‍ విస్తృతమవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్క్ లను పంపిణీ చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్ణయించింది. తెలుగు కమ్యూనిటీని ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే తానా ఈ విపత్కర పరిస్థితుల్లో తనవంతుగా తెలుగు కమ్యూనిటీకి తోడ్పడాలన్న ఉద్దేశ్యంతో వైరస్‍  విస్తృతంగా వ్యాపించకుండా ముందుగా మాస్క్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా దాదాపు 5000  మాస్క్ లను రాజమండ్రిలోని 10 చోట్ల పంపిణీ చేయనున్నారు. తొలుత కరోనా వైరస్‍ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న పోలీసులకు, హెల్త్ వర్కర్లకి మాస్క్ లను పంపిణీ చేయనున్నారు. తరువాత ఇతరులకు కూడా పంపిణీ చేయనున్నట్లు తానా నాయకులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో కూడా  మాస్క్ లను పంపిణీ చేయనున్నట్లు కూడా వారు చెప్పారు.

సతీష్‍ చుండ్రు, రవి సామినేని, వెంకట్‍ యార్లగడ్డ, సురేష్‍ కాకర్ల, సురేష్‍ పుట్టగుంట, వెంకట్‍ కోగంటి, వెంకట రమ యార్లగడ్డ తదితరులు మాస్క్ లను స్పాన్సర్‍ చేశారు. తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది. తానా ట్రస్టీ రవి సామినేని ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్‍ చేయనున్నారు.

 

 

 

Tags :