తానా మహాసభలు - ఎంపి సంతోష్‌కుమార్‌కు ప్రత్యేక ఆహ్వానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలు జూలై 7 నుంచి 9వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నది. ఈ మహాసభలకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ ను తానా నాయకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. తానా మహాసభల కో ఆర్డినేటర్ రవి పొట్లూరి, ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి తదితరులు ఆయనను కలిసి ఆహ్వానపత్రం అందించారు. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో ఈ మహా సభలు జరుగనున్నాయి. ఇక తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పట్ల ‘తానా’ సభ్యులకు ఎంపీ సంతోష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తనను ఆహ్వానించడానికి వచ్చిన ‘తానా’ సభ్యులతో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ ఎన్నారైల పాత్రను సంతోష్ కుమార్ ప్రశంసించారు.
Tags :