ASBL Koncept Ambience

ఎపి రాజధాని అంశంపై న్యూఢిల్లీలో ఎన్నారై టీడిపి ఆందోళన

ఎపి రాజధాని అంశంపై న్యూఢిల్లీలో ఎన్నారై టీడిపి ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పార్లమెంట్‌ ఎదుట ఎన్నారై టీడిపి నాయకులు ఆందోళనకు దిగారు. అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న ఎన్నారై టీడిపి నాయకులు జయరాం కోమటి ఆధ్వర్యంలోని బృందం గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టింది. ఈ సభ్యులంతా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలను కలిసి రాజధాని తరలించకుండా చూడాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జయరామ్‌ కోమటితోపాటు, గంగాధర్‌ నాదెళ్ల, సతీష్‌ వేమన, రఘు మేక తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Tags :