ASBL Koncept Ambience

ఎడ్ల బలప్రదర్శన పోటీలను చూసిన తానా సభ్యులు

ఎడ్ల బలప్రదర్శన పోటీలను చూసిన తానా సభ్యులు

గుంటూరు జిల్లాలోని గురజాలలో జరిగిన ఎడ్లబండలాగు ప్రదర్శన పోటీలను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు తిలకించారు. తానా చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా జిల్లాకు వచ్చిన తానా నాయకులు, సభ్యులను రైతు సంఘం ప్రతినిధులు ఘనంగా ఆహ్వానించారు. ప్రముఖ వైద్యులు చల్లగుండ్ల శ్రీనివాస్‌ రైతు కమిటీ సభ్యులకు తానా నాయకులను పరిచయం చేశారు.

ఈ సందర్భంగా తానా చైర్మన్‌ జంపాల చౌదరి మాట్లాడుతూ తాము ఇదే ప్రాంతానికి చెందిన వారమని చెప్పారు. తమకు ఎండ్ల పందాల గురించి తెలుసని, తమ చిన్నతనంలో ఎప్పుడో ఎడ్ల పందాలను చూశామన్నారు. అయితే తమకు ఎడ్ల పందాలను మరోసారి చూడాలనే కోరిక ఉండిందని, అది నేడు గురజాలలో జరిగిన  ఎడ్ల పందాలను చూడటంతో తీరిందన్నారు. ఈ సందర్భంగా తానా సభ్యులకు రైతు సంఘం జ్ఞాపికలను అందజేసింది. పలువురు తానా సభ్యులు ఎడ్ల వద్ద నిల్చుని ఫోటోలు తీసుకున్నారు. ఎడ్ల పోటీలకు తిలకించేందుకు వచ్చిన తానా సభ్యులను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చారు. అలాగే ఎడ్ల పోటీలు హోరా హోరీగా సాగడంతో  ఎడ్ల పోటీలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, నాదెళ్ళ గంగాధర్‌, తానా అగ్రికల్చరల్‌ ఫోరం చైర్మన్‌ కోటా జానయ్య, సభ్యులు కొండగుట్ట చలపతి, సూరపనేని రాజు, బత్తిన రాకేష్‌లతో పాటు శ్రీనివాస ఆగ్రో కెమికల్స్‌, డ్రిస్టిబ్యూటర్‌ కోట హనుమంతరావు, శ్రీనివాస ఆగ్రో ఏజన్సీ ప్రొప్రైటర్‌ జమ్మిగుంపుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 

Tags :