ASBL Koncept Ambience

తానా సభ్యులు గ్రామాలను దత్తత తీసుకోవడం మంచి పరిణామం

తానా సభ్యులు గ్రామాలను దత్తత తీసుకోవడం మంచి పరిణామం

గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి కృషి చేయడం మంచి పరిణామమని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ అన్నారు. మిర్తిపాడు గ్రామంలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.  ఆయన మాట్లాడుతూ ఎన్నారైలు గ్రామాల అభివృద్ధికి ముందుకు రావడం వల్ల ఆయా గ్రామాలు అభివృద్ధిపథంలో నడుస్తాయన్నారు.  తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, తారక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ఐ నిమ్మలపూడి జనార్ధన్‌, ఎంపీ గరికిపాటి రామమోహన రావు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడు ముళ్లపూడి బాపిరాజు గ్రామాన్ని పరిశీలించారు. మిర్తిపాడు గ్రామాన్ని ఎన్‌ఆర్‌ఐ నిమ్మలపూడి జనార్దన్‌ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దత్తత గ్రామానికి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. 

 

Tags :