ASBL Koncept Ambience

మాధవి సోలేటికి తానా మెరిటోరియస్‌ అవార్డు ప్రదానం

మాధవి సోలేటికి తానా మెరిటోరియస్‌ అవార్డు ప్రదానం

న్యూయార్క్‌ సిటీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ, పిల్లలకు చదువు చెబుతూ, మరోవైపు ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలతో కమ్యూనిటీలో మంచి గుర్తింపును అందుకున్న మాధవి సోలేటికి  ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మెరిటోరియస్‌ అవార్డు లభించింది. విద్యారంగంలోనూ, కళల్లోనూ ఆమె చూపిన ప్రతిభను గుర్తిస్తూ ఆమెకు తానా ఈ అవార్డును అందించింది. ఇటీవల ఫిలడెల్పియాలో జరిగిన తానా 23వ మహాసభల్లో ఆమెకు ఈ అవార్డును బహుకరించారు. తానా, ఆటా, నాటా, నాట్స్‌, టిటిఎ, టిఎల్‌సిఎ, టిఫాస్‌, టిఎజిడివి వంటి తెలుగు సంఘాలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. మన సంస్కృతిని, వారసత్వాన్ని పరిరక్షించే చర్యలను చేపడుతూ, మరోవైపు నాటకరంగాన్ని ప్రోత్సహించేలా అమెరికాలో తెలుగు నాటక రంగానికి ఆహార్యం, మేకప్‌ అందిస్తున్నారు. పలు స్వచ్ఛంద కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొంటున్నారు. పలు మహాసభల్లో తెలుగుసంఘాల కార్యక్రమాల్లో పౌరాణిక నాటక ప్రదర్శనలిస్తున్న కళాకారులకు ఆమె మేకప్‌ చేస్తూ ఆ పాత్రకు సజీవరూపాన్ని కలిగిస్తున్నారు. ఆమె భర్త అశోక్‌ చింతకుంట కూడా పౌరాణిక కళాకారులు. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాల్లో పౌరాణిక వేషాలను వేసి ఎందరినో మెప్పిస్తున్నారు.

 

 

Tags :