ASBL Koncept Ambience

చరిత్ర సృష్టించిన తానా మదర్స్ డే వేడుకలు

చరిత్ర సృష్టించిన తానా మదర్స్ డే వేడుకలు

వర్చువల్‍ గ్లోబల్‍ కాంపిటీషన్స్ 2020 విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్వర్యంలో ఈ సంవత్సరం వినూత్నంగా అంతర్జాలంలో నిర్వహించిన మదర్స్ డే 2020 వర్చువల్‍ పోటీలు ఘనంగా  జరిగాయి. ఈ లాక్‍ డౌన్‍  సమయంలో మదర్స్ డే వేడుకలు నిర్వహించాలన్న పట్టుదలతో తానా అధ్యక్షులు జయ్‍ తాళ్లూరి ప్రోత్సాహంతో, శిరీష తునుగుంట్ల, ఉమెన్స్ సర్వీసెస్‍ కో ఆర్డినేటర్‍, లక్ష్మి దేవినేని ఇంటర్నేషనల్‍ కో-అర్దినేటర్‍ నిర్వహణలో తానా అధ్వర్యంలో  జిజ్ఞాస, జయహో భారతీయం, ఎపిఎన్‍ఆర్‍టీఎస్‍   సంస్థల సహకారంతో  నిర్వహించిన ఈ వర్చువల్‍ గ్లోబల్‍ కాంపిటీషన్స్- 2020 చరిత్రలో ఒక సరికొత్త ప్రయోగంగా నిలిచింది.  రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 7 విభాగాలలో జరిగిన పోటీలలో వివిధ దేశాల నుండి తెలుగు ప్రజలు దాదాపు 1850 మంది 45 జూమ్‍ వీడియో ద్వారా వేర్వేరు విభాగాలలో పాల్గొన్నారు. 100 మంది పోటీ న్యాయనిర్ణేతలతో 128 గంటల నిడివిలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇంత పెద్ద ఎత్తున అంతర్జాలంలో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇండియన్‍ బుక్‍ అఫ్‍ రికార్డస్ లో ఇండియన్‍ వరల్డ్ రికార్డ్  టైటిల్‍ ను మరియు తెలుగు బుక్‍ అఫ్‍ రికార్డస్ లో స్థానం సంపాదించి చరిత్రలో నిలిచింది. ఈ మదర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు, పెద్దలకు, మహిళలకు, పిల్లలకు మరచిపోలేని తియ్యని జ్ఞాపకాల్ని మిగిల్చింది.

ఈ కార్యక్రమంలో ముందుగా తానా అధ్యక్షులు జయ్‍ తాళ్లూరి స్వాగతోపన్యాసం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అమ్మ అందమైన అనుబంధం.. అంతులేని అనురాగం.. మరపురాని మధుర జ్ఞాపకం అంటూ అమ్మ గొప్పతనాన్ని కొనియాడారు. ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఒకరికొకరు దూరంగా ఉన్నా మానసికంగా అమ్మకు ఎంత దగ్గరగా ఉన్నామో, అమ్మకు మన హ•దయాలలో ఎంత గొప్ప స్థానముందో ఈ పోటీల్లో పాల్గొన్నవారు నిరూపించారన్నారు.

మే 16 న ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసి తమ అమూల్యమైన అనుభవాలను పంచుకుని శుభాకాంక్షలు తెలియజేసారు. ఇందులో విజయభాస్కర్‍ - ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం భాష మరియు సాంస్కృతిక శాఖ మాజీ డైరెక్టర్‍, ఎల్‍ వి సుబ్రమణ్యం - ఐఎఎస్‍ అధికారి - ఆంధప్రదేశ్‍ మాజీ చీఫ్‍ సెక్రటరీ ఎపి ప్రభుత్వం, అడుసుమల్లి రాజమౌలి ఐఎఎస్‍ - మాజీ ప్రధాన కార్యదర్శి, మాధవరావు పట్నాయక్‍ - న్యాయమూర్తి వినియోగదారుల కోర్టు (విజయవాడ),  శ్రీమతి రజని ప్రియా - ఎస్టేట్‍ మేనేజర్‍ - ప్రెసిడెన్షియల్‍ సెక్రటేరియట్‍-రాష్ట్రపతి భవన్‍-భారత ప్రభుత్వం, కోనేరు కాంచన - కార్యదర్శి కెఎల్‍యు తదితరులు ఉన్నారు. వీరందరికీ తానా అధ్యక్షులు జయ్‍ తాళ్లూరి, వారి బ•ందం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.

మే 17 తేదీ రెండవ రోజు జరిగిన ముగింపు కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు విజేతలను అభినందిస్తూ బహుమతులు ప్రకటించి  తమ సందేశాల్లో అమ్మతో తమకున్న మధురానుభూతులను నెమరువేసుకున్నారు. పద్మవిభూషణ్‍ వరప్రసాద్‍ రెడ్డి, చైర్‍పర్సన్‍, శాంత బయోటెక్‍, విజయ భాస్కర్‍ - ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం భాష, సాంస్కృతిక విభాగం మాజీ డైరెక్టర్‍,  మన్మోహన్‍ సింగ్‍ ఐఎఎస్‍ ఎక్స్ స్పెషల్‍ చీఫ్‍ సెక్రటరీ, ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం, పి వి సునీల్‍ కుమార్‍, ఐపిఎస్‍ డిజి, చీఫ్‍, సిఐడి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం, అదుసుమల్లి రాజమౌళి, ఐఎఎస్‍ ప్రిన్సిపల్‍ సెక్రటరీ, ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం, వి వి (జెడి) లక్ష్మి నారాయణ, ఐపిఎస్‍ సిబిఐ మాజీ అధికారి, వెంకట్‍ మేడపాటి, చైర్మన్‍, ఎపిఎన్‍ఆర్‍టి, రమేష్‍ బాబు పోతినేని, చైర్మన్‍, ప్రముఖ కార్డియాలజిస్ట్, రమేష్‍ హాస్పిటల్స్, హిమాన్షు శుక్లా ఐఎఎస్‍, జాయింట్‍ కలెక్టర్‍, వెస్ట్ గోదావరి, ఎక్స్ డైరెక్టర్‍, ఆంధప్రదేశ్‍ టూరిజం, కోనేరు సత్యనారాయణ, కెఎల్‍యు విశ్వవిద్యాలయం చైర్మన్‍ కు తానా అధ్యక్షులు జయ్‍ తాళ్లూరి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తానా పూర్వ అధ్యక్షులు జయరామ్‍ కోమటి, గంగాధర్‍ నాదెళ్ళ, సతీష్‍ వేమన, జంపాల చౌదరి తదితరులు పాల్గొన్నారు.

అమ్మ నీకు వందనం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా డా.శాంత కుమారి రచించిన పాటను గాయకుడు రవి మండ ఆలపించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి పలువురు తానా నాయకులు, కార్యకర్తలు కృషి చేశారు. తానా ఉమెన్‍ ఫోరం సభ్యులు పద్మజ బెహర, హిమాబిందు కోడూరు, శ్రీలక్ష్మి మామిడిపల్లి, రేఖ ఉప్పుటూరి, మాధురి ఏలూరి, శ్రావణి, డాక్టర్‍ ఉమా కటికి, ‘‘జిజ్ఞాస’’ సంస్థ డైరెక్టర్‍ భార్గవ, జయహో భారతీయం ఫౌండర్‍ శ్రీనివాస్‍, న్యూయార్క్ టీం దీపిక సమ్మెట, శైలజ చల్లపల్లి, కృష్ణశ్రీ గంధం, హరిశంకర్‍ రసపుత్ర, స్నేహ, ఇండియా యూత్‍ కోఆర్డినేటర్లు వెంకటేష్‍, నిఖిల, సుమంత్‍ రామిశెట్టి, పృథ్వి చేకూరి, వంశీ వాసిరెడ్డి, సురేష్‍ మిట్టపల్లి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. శిరీష అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Click here for Photogallery

 

Tags :