ASBL Koncept Ambience

తానా కాన్ఫరెన్స్ వెబ్‌సైట్‌ ప్రారంభం

తానా కాన్ఫరెన్స్ వెబ్‌సైట్‌ ప్రారంభం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) రెండేళ్ళకోమారు నిర్వహించే ద్వైవార్షిక మహాసభలు ఈ సంవత్సరం మే 26, 27, 28 తేదీల్లో సెయింట్‌ లూయిస్‌ నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలను పురస్కరించుకుని www.tana2017.org ను ప్రారంభించారు. ఎల్లలు లేని తెలుగు ఎప్పుటికీ వెలుగు అనే సందేశంతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. మహాసభలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధ్యక్షుడు జంపాల చౌదరి తెలిపారు. మహాసభల వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగువారు ఈ మహాసభలకు తరలివచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు కోరారు. ఈ మహాసభలకు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న చదలవాడ కూర్మనాథ్‌ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామకృష్ణ వీరవల్లి, జితేంద్ర ఆలూరి, రావ్‌ వల్లభనేని, సురేష్‌ ఎలవర్తి, గోపీ ఉప్పల, శేషు ఇంటూరి, నాగేశ్వరరావు బొప్పన, మురళీ కృష్ణ పుట్టగుంట ఇతర కమిటీల చైర్‌పర్సన్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

 

Tags :