తానా న్యూఇంగ్లాండ్ టీమ్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగ్ ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూఇంగ్లాండ్ టీమ్ ఆధ్వర్యంలో అమెరికన్ కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా స్కూల్ చిన్నారులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఎంఎలోని వర్స్‌సెస్టర్ కౌంటీలో ఉన్న 2 డిసిఎఫ్ సెంటర్‌లో దాదాపు 300 బ్యాగ్‌లను పంపిణీ చేశారు. విశ్వనాథ్ నాయునిపాటి, శ్రీకాంత్, రావు కందుకూరి, సాయి ప్రశాంత్, అంకినీడు రవి, రమ గుడివాడ, రావు యలమంచిలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికీ తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి అభినందనలు తెలిపారు.
Tags :