ASBL Koncept Ambience

ప్రముఖుల సమక్షంలో తానా-పాఠశాల ఆత్మీయ సమావేశం

ప్రముఖుల సమక్షంలో తానా-పాఠశాల ఆత్మీయ సమావేశం

అమెరికాలోని తెలుగు వారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తానా మహాసభలకు అంతా సిద్ధమైంది. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడులు జరగనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగానే ‘తానా-పాఠశాల ఆత్మీయ సమావేశం’ కూడా జరుగుతుంది. ఇక్కడి రూం నెంబర్ 103సీలో ఆదివారం నాడు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ కవి బీరం సుందర రావు, నటులు భరత్ రెడ్డి, రవి వర్మ, ‘తెలుగు టైమ్స్’ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి పాల్గొంటున్నారు. అలాగే కన్వెన్షన్ సెంటర్‌లో విద్యార్థుల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాల బూత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ చైర్మన్ శ్రీనివాస్ లావు, తానా-పాఠశాల ఇంటర్నేషనల్ చైర్మన్ నాగరాజు నాలాజుల, తానా-పాఠశాల కన్వెన్షన్ చైర్మన్ లక్ష్మీ అద్దంకి, కో-చైర్‌లు ఫని కంథేటి, కాళీ ప్రసాద్, ప్రసాద్ మంగిన కోరుతున్నారు.

 

 

Tags :