ASBL Koncept Ambience

తానా- అమ్మానాన్న గురువు పద్యార్చన విజయవంతం - జే తాళ్ళూరి

తానా- అమ్మానాన్న గురువు పద్యార్చన విజయవంతం - జే తాళ్ళూరి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో కవి చిగురుమళ్ళ శ్రీనివాస్‌ సంయుక్త నిర్వహణలో జనవరి 6 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ''అమ్మ నాన్న గురువు-శతక పద్యార్చన'' కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగి విజయవంతమైందని తానా అధ్యక్షులు జే తాళ్ళూరి తెలిపారు.

ఈ పద్యార్చన కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని, ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందని  చెప్పారు. ఇది సాహితీ చరిత్రలో అపూర్వమైన, అద్భుతమైన ఘట్టంగా నిలిచిందని, ఇది

'కన్నవారికి కనకాభిషేకం..
పద్యానికి పట్టాభిషేకం...
అమ్మ భాషకు అమతాభిషేకం...'
వంటిడని  జే తాళ్ళూరి అన్నారు.

అమెరికాలో పలు నగరాల్లో, మాతృరాష్ట్రాల్లో వివిధ చోట్ల ఈ కార్యక్రమం జరిగిందని, ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని పద్యాలను ఆలపించి పెద్దలపై తమ తల్లితండ్రులపై, గురువులపై ఉన్న భక్తిశ్రద్ధలను చాటారని అన్నారు.

అమ్మా నాన్న గురువుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం పెరిగే విధంగా తెలుగుభాషా సంస్కతుల పరిరక్షణ, మానవతా విలువలు ప్రోదిగొల్పుట వంటి మహనీయమైన లక్ష్యాలతో ఈ పవిత్రమైన యజ్ఞంను తానా తల పెట్టిందని ఈరోజు అది ఎంతో విజయవంతంగా జరిగిందని, భాషా సంస్కతుల పరిరక్షణార్ధం ఈ బహత్‌ యజ్ఞం కొనసాగుతుందని జే తాళ్ళూరి అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలతోపాటు, అమెరికాలోని న్యూయార్క్‌, ఫిలడెల్ఫియా, కొలంబస్‌, కాలిఫోర్నియా వంటి  చోట్ల, దాదాపు ముప్పై నగరాలలోని తెలుగు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావాలని తమ అమూల్యమైన ఆశీస్సులు అందించిన కళాతపస్వి శ్రీ విశ్వనాధ్‌ గారికి, సినీ గేయ రచయిత చంద్రబోస్‌ గారికి, జె.డి లక్ష్మీనారాయణ గారికి, శ్రీ తనికెళ్ల భరణి గారికి, శ్రీ వందేమాతరం శ్రీనివాస్‌ గారికి, గాయని  సునీత గారికి పెద్దలందరికీ తానా తరపున జే తాళ్ళూరి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఎంతో సహకరించిన  శ్రీనాథ్‌ కుర్రా గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ బహత్‌ యజ్ఞంలో మాకు సలహాలు సూచనలు అందించిన, సహకరించిన తానా మాజీ అధ్యక్షులు జంపాల చౌదరి, సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ అంజయ్య చౌదరి, బోర్డ్‌ చైర్మన్‌  హరీష్‌ కోయా, ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శంగవరపు, కార్యదర్శి రవి పొట్లూరి,  జాయింట్‌ సెక్రటరీ అశోక్‌ కొల్లా, ఉమెన్స్‌ కో ఆర్డినేటర్‌ శిరీష తూనుగుంట్ల, రాం సుమంత్‌, రాజా కసుకుర్తి, రాం చౌదరి ఉప్పటూరితోపాటు పాలుపంచుకున్న ఇతర సభ్యులందరికి పేరుపేరునా ధన్యవాదాలను తెలిపారు.

ఈ కార్యక్రమంలో సేవలందించిన  పనిచేసిన జిల్లా, ప్రాంతీయ సమన్వయకర్తలకు, పాఠశాలల యాజమాన్యాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, బాలబాలికలకు  అందరికీ కూడా మా యొక్క హ దయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పాల్గొన్న ప్రతి పాఠశాలకు తానా ప్రశంసాపత్రాలను త్వరలో అందజేస్తామని జే తాళ్ళూరి తెలియజేశారు.

Click here for Event Gallery

 

Tags :