తానా దివ్యాంగుల క్రికెట్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఆధ్వర్యంలో గీతం వేదికగా డిసెంబర్ 9 నుంచి 13 తేదీ వరకు దివ్యాంగుల కోసం వీల్‌చైర్ సౌత్ ఇండియా క్రికెట్ కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తానా ఫౌండేషన్ క్రీడా విభాగం కో ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను గీతం అధ్యక్షుడు ఎమ్. శ్రీభరత్ ఆవిష్కరించారు. దివ్యాంగులలో క్రీడాస్ఫూర్తిని నింపడానికి ఈ తరహ పోటీలు ఉపకరిస్తాయని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వీల్ చైర్ అండ్ డిజెబిలిట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శామ్యూల్ బెంజియన్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు రుక్మాకరరావు, కార్యదర్శి రామన్ సుబ్బారావు మాట్లాడుతూ గీతం క్రికెట్ స్టేడియంలో జరిగే పోటీలకు దక్షిణ భారత దేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా దివ్యాంగుల క్రికెటర్లు హాజరవుతున్నారని వెల్లడించారు. బిసిసిఐకీ అనుబంధంగా గల భారత వీల్ చైర్ క్రికెట్ అసోసియేన్ తదితర సంస్థల సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి క్రీడాకారులకు వసతి సదుపాయాలను అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడం పట్ల గీతం విశ్వవిద్యాలయానికి తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి, వ్యవస్థాపక చైర్మన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ ట్రస్టీ రవిసామినేని ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతం క్రీడా విభాగం డైరెక్టర్ అరుణ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.