‘దిశకు’ నివాళులర్పించిన తానా
న్యూయార్క్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో 'దిశ'కు నివాళి అర్పించే కార్యక్రమం జరిగింది. ఇలాంటి అమానుషమైన చర్యలను తానా తీవ్రంగా ఖండిస్తోందని తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి అన్నారు.
షాద్ నగర్ లో 'దిశ' పై జరిగిన అమానుష దాడి యావత్ దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న తమనందరినీ ఎంతో కలచి వేసిందని ఈ అమానుష చర్య సభ్య సమాజం తలదించుకునేలా చేసిందని జే తాళ్లూరి ఆందోళన వ్యక్తం చేసారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చట్టాలలో సత్వరమే మార్పులు తీసుకువచ్చి బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసారు. 'దిశ' మరణానికి తమ సంతాపాన్ని తెలుపుతూ 'దిశ' కుటుంబానికి ''తానా''సంస్థ, నాయకత్వం తరఫున తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామన్నారు.
డిసెంబర్ 8వ తేదీన జరిగిన ఈ కార్యక్రమంలో తానాతోపాటు స్థానిక తెలుగుసంఘం టి.ఎల్.సి.ఏ నిర్వహించిన కార్యక్రమంలో ఎంతోమంది తానా ప్రతినిధులు పాల్గొని 'దిశ' పై జరిగిన అమానుష దాడిని తీవ్రంగా ఖండించారు. దిశ పై జరిగిన ఈ అమానుష దాడితో తామంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డామని ఈ రాక్షస చర్య సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని ''తానా'' ఉమెన్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ శిరిష తునుగుంట్ల, ''తానా'' రీజనల్ కో ఆర్డినేటర్ సుమంత్ రాంశెట్టి ఆందోళన వ్యక్తం చేసారు. భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నా సమాజంలో ఇప్పటికీ స్త్రీలపై ఇలాంటి అమానుష దాడులు జరగడం దురదష్టకరమని, 'దిశపై జరిగిన అమానుష దాడి తమని ఎంతగానో కలచి వేసిందని వీటికి కారణమైన దుర్మార్గులకు వెంటనే పడిన శిక్ష సరిఅయినదేనన్నారు.
'తానా' అధ్యక్షులు జే తాళ్లూరి మార్గదర్సకత్వంలో అమెరికాలో ఉంటున్న అనేక మంది ఒంటరి మహిళలకు, మహిళా విద్యార్థులకు, ''గహ హింస'' బాధితులకు, ''తానా'' తమ వంతుగా సహాయం చేస్తూ అండగా ఉంటోందని, ఈ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఇతర మహిళలనుండి, విద్యావంతులనుండి సలహాలు, సూచనలు తీసుకొని '' తానా'' భవిషత్తులో ఒక కార్యాచరణని రూపొందించే కార్యక్రమంలో ఉందని ఉమెన్స్ కో ఆర్డినేటర్ శిరిష తునుగుంట్ల తెలిపారు.
దేశమంతటా ''నిర్భయ' చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు పరచి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. అలాగే ''ఉన్నావ్'' బాధితురాలికి సత్వరమే న్యాయం చేయాలని, స్త్రీలపై జరిగిన అత్యాచారాల కేసులన్నీ సత్వరమే పరిష్కరించి వారందరికీ న్యాయం చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులంతా ముక్తకంటంతో డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు రావు ఓలేటి, హరిశంకర్ రసపుత్ర, శైలజ చల్లపల్లి, సత్య చల్లపల్లి, కష్ణశ్రీ, దీపిక సమ్మెట, రజని, శ్రావణి పాల్గొని తమ సానుభూతిని తెలియ జేశారు. టి.ఎల్.సి.ఏ అధ్యక్షులు అశోక్ చింతకుంట, రమకుమారి వనమ, మాధవి సోలేటి, తదితరులు పాల్గొని ప్రసంగించారు.