ఫిలడెల్ఫియా తానా టీమ్ అభినందన వేడుక
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫిలడెల్ఫియా విభాగం వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ వేడుకను పురస్కరించుకుని టీమ్ అభినందనతోపాటు థ్యాంక్స్ గివింగ్ డిన్నర్‌ను తానా ఫిలడెల్ఫియా విభాగం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా తానా కేర్స్ కార్యక్రమం కింద ఫుడ్ డ్రైవ్‌ను పెద్దఎత్తున చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. యూత్ టీమ్ ఈ కార్యక్రమం చేపట్టడానికి ముందుకు వచ్చింది. వచ్చే 3 వారాల్లో 25,000 మందికి సరిపడే భోజనంతోపాటు 2 టన్నుల కేన్‌డ్ మీల్స్ కలెక్ట్ చేయడానికి తానా యువ టీమ్ ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో తానా కార్యదర్శి రవి పొట్లూరితోపాటు నాగరాజు నలజుల, జగదీష్, సునీల్ కోగంటి, మోహ్, కృష్ణ కొనగళ్ళ, సతీష్ చుండ్రు తదితరులు పాల్గొన్నారు.
Tags :