ప్రపంచ సాహిత్యవేదికకు తానా శ్రీకారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు భాష పరిరక్షణకు ఎన్నో కార్యక్రమాలను చేస్తోంది. అందులో భాగంగా ఈనెలలో అంతర్జాలం లో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ను ప్రారంభిస్తున్నామని తద్వారా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, వ్యాప్తిలో తానా మరో ముందడుగు వేస్తోందని తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి అన్నారు. తానా సంస్ధ తరపున ఈ సాహిత్య వేదిక తెలుగు భాషా ప్రియులు, తానా పూర్వ అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర ఆధ్యర్యం లో మే 31నుంచి ప్రారంభం కానున్నదని కూడా ఆయన తెలియజేశారు.
డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’’ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు, చర్చలు, అవధానాల తో పాటు కథలు, కవితలు, ఫోటో కవితలు, పద్యాలు, పాటలు, బాల సాహిత్యం లాంటి వివిధ అంశాలలో ప్రపంచ వ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తామని, మే నెలనుంచి ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశం జరుపుతామని ప్రకటించారు. ప్రథమ దృశ్య సమావేశం ఆదివారం, మే 31, 2020 న అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు, భారతదేశంలో రాత్రి 9.30 గంటలకు జరగనుంది. ఈ సాహిత్య సమావేశంలో ముఖ్య అతిధిగా ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు శ్రీ. వంగపండు ప్రసాద రావు తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాహితీ ప్రియులందరూ ఈ దృశ్య సమావేశంలో ఈ క్రింది ఏ మాధ్యమాల ద్వారా నైనా పాల్గొనవచ్చని ప్రసాద్ తోటకూర ఆహ్వానం పలికారు.
1. Webex Link: https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40
2. Join by phone:
USA: 1-408-418-9388
Access code: 798 876 407