ASBL Koncept Ambience

ఘనంగా పదవీ కాలం ముగించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు

ఘనంగా పదవీ కాలం ముగించిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు

తానా 23వ మహాసభల చివరి రోజునే ఈ సంస్థ ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు గారి పదవీ కాలం కూడా ముగిసింది. ఆరంభం నుంచే సేవా భావం ఉన్న అంజయ్య చౌదరి గారు.. తానాలో చేరిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగా ప్రెసిండెంట్ పదవి పొందారు. 46 ఏళ్ల తానా చరిత్రలో ఈ రెండు సంవత్సరాల్లో జరిగినన్ని సేవా కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదని అంజయ్య చౌదరి చెప్పారు. దీనిలో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఫౌండేషన్, బోర్డు సభ్యులు, వందల మంది వాలంటీర్లు అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సుమారు 1700 మందికి ‘తానా చేయూత’ ద్వారా స్కాలర్‌షిప్‌లు అందించామని చెప్పారు. అలాగే 100కి పైగా కేన్సర్ క్యాంపులు నిర్వహించామన్నారు. ‘తానా ఆరుణ్య’ ద్వారా పల్లెటూళ్లలో ఉన్న చెవుడు, మూగ చిన్నారులను గుర్తించి, అవసరమైన సహకారం అందించామని గుర్తుచేశారు. 

అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వారికి ఎలాంటి విపత్తు వచ్చినా తానా టీంస్క్వేర్ వెంటనే స్పందిస్తుందని తెలిపారు. ‘తానా చైతన్య స్రవంతి’లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 42 రోజుల పాటు సుమారు 110 సేవా కార్యక్రమాలు నిర్వహించామని అంజయ్య చౌదరి తెలియజేశారు. ‘తానా అన్నపూర్ణ ద్వారా విజయవాడ, తెనాలి, గుంటూరులో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించాం. అక్కడి ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రతి రోజూ 600 మంది పేషెంట్లకు న్యూట్రీషియస్ ఫుడ్ అందిస్తున్నాం. పబ్లిక్ లైబ్రరీలు, డిజిటల్ క్లాస్ రూంలు, అంగన్‌వాడీ.. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇదంతా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ అండ్ టీం, ఎగ్జిక్యూటివ్ కమిటీ సహా అందరూ ఎంతో కృషి చేయడం వల్లనే సాధ్యమైంది. అందరికీ పేరు పేరునా నా ధ్యనవాదాలు’ అని చెప్పారు. అలాగే ఈ రోజుతో తానా ప్రెసిడెంట్‌గా తన పదవి ముగుస్తుందని, తర్వాతి ప్రెసిడెంట్‌గా నిరంజన్ శృంగవరపు బాధ్యతలు చేపడతారని వెల్లడించారు. తానా అధ్యక్షులుగా ఆయన చేసిన సేవకుగానూ తానా నేతలంతా కలిసి అంజయ్య చౌదరి గారిని సత్కరించారు.

 

 

 

 

Tags :