తానా మహాసభలు అందరి పండుగ : ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి
తానా 23వ మహాసభల రెండో రోజు కూడా అంగరంగ వైభవంగా మొదలైంది. ఈ వేడుకల ఆరంభంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ.. ఈ సభలకు హాజరైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ఇది తమ పండుగ అనుకునేలా ఈ వేడుకలకు ఏర్పాట్లు చేశామని, అందరూ అలాగే అనుకొని ఆశీస్సులు అందించాలని కోరారు.
అనంతరం కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించడంలో కృషి చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తానా ఎక్స్అఫీషియో మెంబర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ హనుమయ్య బండ్ల మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతీసంప్రదాయాలను పరిరక్షించేందుకు తానా గొప్ప కృషి చేస్తోందన్నారు. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి మేలు చేస్తున్న ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
అనంతరం ఈ కార్యక్రమం కోసం జొన్నవిత్తుల రామలింగ శాస్త్రి రచించిన పాట ‘తెలుగు వైభవం’ పాటకు నృత్య రూపకం ప్రదర్శించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.