ASBL Koncept Ambience

చంద్రబాబును కలిసిన సతీష్ వేమన

చంద్రబాబును కలిసిన సతీష్ వేమన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను పురస్కరించుకుని తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. ఈ సందర్భంగా తానా రైతులకోసం నిర్వహిస్తున్న సమావేశాలను, క్రిమిసంహారకమందులను వాడేటప్పుడు రైతుల రక్షణకోసం తానా ఇస్తున్న  రైతు కిట్‌ల పంపిణీ వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియజేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.కోటి విలువైన 30 వేల 'రైతు రక్షణ కిట్లు'ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. రైతుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

 

Tags :