ASBL Koncept Ambience

రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు

రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.350 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని, హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌కు మూల పెట్టుబడి తానాదేనని ఎన్నారై తాళ్లూరి జయశేఖర్‌ తెలిపారు. తానా ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండలం మోటాపురం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఎన్నారై బెల్లం మధు అధ్యక్షతన జరిగిన రైతు రక్షణ కిట్ల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు.  తానాను స్థాపించి 40 ఏళ్లు పూర్తవుతోందని, ఏపీలోని గుంటూరులో 2003లో శంకర ఐ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 25వేల కంటి ఆపరేషన్లు చేయించినట్లు వివరించారు. తానా రైతుకోసం కార్యక్రమ రూపకర్త జానయ్య  మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో తానా ఆధ్వర్యంలో 15రోజులుగా చైతన్య స్రవంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. రైతుకలు చేయూత నందించే క్రమంలో రక్షణ కిట్లు పంపిణి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తానా ఆధ్వర్యంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఒక సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది రైతులకు రక్షణ కిట్లను   అందజేశారు. తాళ్లూరి పంచాక్షరయ్యను సన్మానించారు. కార్యక్రమంలో తానా కార్యదర్శి తాతా మధు, బెల్లం మధు, తాళ్లూరి పంచాక్షరయ్య, నల్లమల వెంకటేశ్వరరావు, ఎన్నారై ఫౌండేషన్‌ సొసైటీ కార్యదర్శి నరేంద్ర స్వరూప్‌, బండి వెంకటేశ్వర్లు, ఏడీఏ బి.వాణి, వ్యవసాయాధికారి నారాయణరావు, ఎన్నారై ఫౌండేషన్‌ సభ్యురాలు గాదెల ఝాన్సీ,  చావా లెనిన్‌, నున్నా రవి, బెల్లం పుల్లయ్య, గుడి మళ్ల మధు, ఏలూరి రంగరావు, సర్పంచ్‌ నాగయ్య, ఎంపీటీసీ యల్లావుల కీతమ్మ, స్వరూపరాణి పాల్గొన్నారు. అంతకుముందు గుంటూరు కళాకారులు ప్రదర్శించిన శివతాడవం విశేషంగా  ఆకట్టుకుంది.

కార్యక్రమంలో పాల్గొనడానికి మోటాపురానికి వచ్చిన తానా సభ్యులకు గ్రామస్థులు ఘన స్వాగతం  పలికారు. గ్రామంలోని శ్రీసి తారామచంద్ర స్వామి వారి ఆలయం వరకు సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో సర్పంచ్‌ శ్యామ.

 

Tags :