ASBL Koncept Ambience

'రైతులకు అండగా 'తానా' : రవి పొట్లూరి

'రైతులకు అండగా 'తానా' : రవి పొట్లూరి

పల్లెటూరిలో పచ్చటి  పొల్లాలతో మంచి దిగుబడులు రైతులు సాధించేందుకు వారికి అండగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారం ఉంటుందని సంస్థ సంయుక్త కార్యదర్శి పొట్లూరి రవి అన్నారు.  ఆదివారం మండల పరిధిలోని కలుకుంట్ల గ్రామంలో ముప్పా ఫౌండేషన్‌ ముప్పా రాజశేఖర్‌ ఆధ్వర్యంలో రైతులకు సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్లూరి రవి మాట్లాడుతూ జన్మభూమి రుణం తీర్చుకోవడానికి అమెరికాలో ఉన్న తెలుగువారు సంపాదించిన రూ.10లో 2 జన్మభూమి కోసం ఇస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాల్లో రైతులు, వృద్ధుల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రైతుల కోసం పంటల దిగుబడి కోసం సమావేశాలు ఏర్పాటు చేసి వినూత్న పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలో అవగాహన కల్పిస్తున్నామన్నారు.

శాస్త్రవేత్త  జానయ్య కోట మాట్లాడుతూ రైతులు పొల్లాలో క్రిమిసంహాకరాలు పిచికారి చేసే సమయంలో ఎలాంటి రక్షన లేక నోటిద్వారా కంట్లో రసాయనాలు పడుతున్నాయని, అస్వస్థకు గురువుతున్నారన్నారు. రైతుల రక్షణ కోసం తానా ఆధ్వర్యంలో రైతులకు రక్షణ ఇచ్చే సామగ్రి పంపిణీ చేశామని అన్నారు. తానా ద్వారా పొలాల్లో భూసార పరీక్షలు  నిర్వహిస్తామన్నారు. కార్యక్రంలో ముప్పా మల్లికార్జున, ముప్పా శ్రీనివాస్‌రావు, మార్కెట్‌  యార్డ్‌ మాజీ చైర్మన్‌ ఆంజనేయగౌడ్‌, ఆత్మలింగారెడ్డి, తెలుగు  మహిళ రాష్ట్ర కార్యదర్శి హేమమాలిని,  సర్పంచి పద్మావతమ్మ, శ్రీను బలమయ్య, వినోద్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Click here for Photogallery

 

Tags :