తానా రైతుకోసం...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం 21వ మహాసభల్లో రైతుకోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించింది. తానా వ్యవసాయ కమిటీ దీనికి సంబంధించి కార్యక్రమాలతోపాటు, ప్రముఖులను ఇందులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవాల్సిన చర్యలపై ఓ సదస్సును కూడా ఏర్పాటు చేసింది. భూసార పరిరక్షణ, పంట కోతల తరువాత అనుసరించాల్సిన సాంకేతిక పద్ధతులు, నైపుణ్యాలు, రైతుల వ్యక్తిగత పరిరక్షణ, ఆహారశుద్ధి, వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులపై వ్యవసాయ శాస్త్ర నిపుణులు, ప్రముఖులతో చర్చలు, వ్యవసాయరంగంలో తలసరి ఆదాయాన్ని పెంచడం వంటివి ఈ సదస్సు సందర్భంగా చర్చించనున్నారు. లాభసాటి వ్యవసాయం చేయడం ఎలా అన్న దానిపై కూడా ప్యానల్ డిస్కషన్ జరుగుతుంది.
వ్యవసాయరంగ కార్యక్రమాలకు విశిష్ట అతిధులుగా తెలంగాణ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నుంచి కామినేని శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు ఈదర హరిబాబు, నెట్టెం రఘురాం, ముళ్ళపూడి బాపిరాజు తదితరులు పాల్గొంటున్నారు.