ASBL Koncept Ambience

కవితలు...ఆవిష్కరణలతో సందడిగా సాగిన 'తానా' సాహిత్య సమ్మేళనం

కవితలు...ఆవిష్కరణలతో సందడిగా సాగిన 'తానా' సాహిత్య సమ్మేళనం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం, డిసెంబర్‌ 30వ తేదీన నిర్వహించిన మూడు తరాల సాహిత్య సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఇందులో మూడు తరాల సాహిత్యకారులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 25మంది కవులు పాల్గొని తమ కవితలను వినిపించారు. 10మంది తెలుగు అధ్యాపకులు పాల్గొన్నారు. కవులు రచించిన పలు పుస్తకాలను కూడా ఈ సాహిత్య సదస్సులో తానా నాయకులు ఆవిష్కరించారు.

తానా నాయకులు లావు అంజయ్య చౌదరి, రవి పొట్లూరి, చలపతి కొండ్రకుంట, లక్ష్మీదేవినేని, రవి మందలపు, మూల్పూరి వెంకట్రావు, యడ్ల హేమప్రసాద్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా నాయకులు మాట్లాడుతూ, తెలుగు సాహిత్య పరిరక్షణకు తానా మొదటి నుంచి కృషి చేస్తోందని, కవులకు, కళాకారులకు గుర్తింపును తేవడంతోపాటు, వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతోనే తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, కవి ఎల్‌.బి. శ్రీరామ్‌, భారత భాషా భూషణ్‌ డా. తిరునగరి, డా. పెద్దింటి అశోక్‌కుమార్‌ కూడా పాల్గొని మాట్లాడారు. పొట్లూరి హరికృష్ణ ఈ కార్యక్రమాన్ని చక్కగా సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన అందరినీ అభినందించారు.

Click here for Event Gallery

Tags :