ఘనంగా 'తానా' సంక్రాంతి వేడుకలు
కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తానా అధ్యక్షుడు సతీష్ వేమన, కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో సంయుక్త ఉప సంచాలకులు ఆకె రవికష్ణ, తానా నాయకులు రవి పొట్లూరి నరేన్ కొడాలి, రాకేష్ బత్తినేని, ప్రసాద్ గారపాటి, ప్రకాశ్ బత్తినేని, లక్ష్మీదేవినేనితోపాటు ప్రముఖ గాయని సునీత, ఎన్‌ఆర్‌సి నాయుడు, ముప్పా రాజశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ, స్త్రీశక్తి భవనాన్ని పొదుపు మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెండేళ్ల కిందట కప్పట్రాళ్ల గ్రామంలోనే మొదటగా రైతులకు కిట్లను పంపిణీ చేసి ప్రారంభించామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల రైతులకు కిట్లను పంపిణీ చేశామని గుర్తు చేశారు. మరో మూడు నెలల తర్వాత రైతులకు మళ్లీ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. ఉన్నత పాఠశాలకు 5 కంప్యూటర్లు ఇవ్వాలని ఉపాధ్యాయ బ ందం కోరడంతో నెల రోజులోపు సమకూరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామానికి సంక్రాంతి పండగ రెండు రోజుల ముందే వచ్చిందన్నారు.
ఐపిఎస్ అధికారి ఆకె రవికృష్ణ మాట్లాడుతూ, కప్పట్రాళ్ల గ్రామం నుంచి ఎంతో నేర్చుకున్నానని, మహిళలు ఆర్థిక శక్తిగా రాణించాలన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న మొదటి రోజున గ్రామంలో పర్యటించినప్పుడు ప్రాథమిక పాఠశాలలోని వరండాలో ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువుతున్నప్పుడు ఆరా తీయగా 12 ఏళ్ల కిందట ఉన్నత పాఠశాలకు నిధులు మంజూరైనా ఇంత వరకు నిర్మించలేదని చెప్పారన్నారు. ఆ మరుసటి రోజున కలెక్టర్‌ను కలిసి 5 గదులకు అనుమతి కోరడం, ఆ తర్వాత మానవ వనరుల అభివ ద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావును హైదరాబాద్‌లో కలవగా 10 అదనపు గదులు మంజూరు చేశాని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గ్రామానికి సంబంధించి ఫైల్ రూపొందించుకొని ప్రభుత్వం నుంచే కాక చేయూత నిచ్చే సంస్థల నుంచి నిధులు సమీకరించి అభివద్ధి పనులు మొదలు పెట్టానని వివరించారు. గ్రామాభివద్ధికితోడుగా తానా స్పందించి ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా సినీ గాయని సునీత తన పాటలు, మాటలతో ఆకట్టుకున్నారు. అనంతరం ముప్పా హస్మిత, దీక్షిత న త్యాలు అలరించాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ రమేష్ సనిమా డైలాగ్స్‌తో సందడి చేశారు. దేవీయాడ్స్ అధినేత విజయ్‌భాస్కర్ 5 వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం కప్పట్రాళ్ల గ్రామస్థులు తానా బందాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం ముగ్గుల పోటీలు, బండలాగు పోటీలు నిర్వహించారు. అంతకముందు గ్రామంలో వచ్చిన అతిథులను ఎద్దుల బండిపై ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కోరమాండల్ అధినేత జీవీ రెడ్డి, ఏఎస్పీ బాబురావు, డీఎస్పీలు ఖాదర్‌బాషా, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.