ASBL Koncept Ambience

కనువిందు చేసిన హారీస్‌బర్గ్‌ తానా సంక్రాంతి వేడుకలు

కనువిందు చేసిన హారీస్‌బర్గ్‌ తానా సంక్రాంతి వేడుకలు

హారీస్‌బర్గ్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు అదరహో అనిపించాయి. దాదాపు 200 మంది తమ కళానైపుణ్యంతో సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. క్లాసికల్‌ డ్యాన్సెస్‌, ఫ్యాషన్‌ షో, గాయనీగాయకుల పాటల ఆలాపన వంటివి అందరినీ ఎంతగానో మైమరపింపజేశాయి. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం ఆకట్టుకుంది. తానా మిడ్‌ అట్లాంటిక్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సతీష్‌ చుండ్రు, వెంకట్‌ సింగు ఆధ్వర్యంలో తానా హారీస్‌బర్గ్‌ కమిటీ ఈ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించింది. పెన్సిల్వేనియాలోని మెకానిక్స్‌బర్గ్‌ కుంబర్‌లాండ్‌ వాలీ మిడిల్‌స్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1500మందికిపైగా తెలుగువారు ఇతరులు హాజరయ్యారు. గణేశ స్తుతితో కార్యక్రమాలను ప్రారంభించారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శించిన విభిన్నమైన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌ కాకర్ల నాయకత్వంలోని కల్చరల్‌ టీమ్‌ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసింది. దాదాపు 200 మంది ఎన్నారై పిల్లలు తెలుగు పద్యాలను పాడటం హైలైట్‌గా నిలిచింది. ఇటీవల తానా పద్యార్చన పేరుతో అమ్మానాన్న గురువు పేరుతో ప్రపంచవ్యాప్తంగా శతకపద్యార్చన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. చిన్నారులతోపాటు జే తాళ్ళూరి కూడా కలిసి పద్యాలను ఆలపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఫుడ్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న యువ వలంటీర్ల సేవలను కూడా పలువురు ప్రశంసించారు. తానా ఫౌండేషన్‌కు విశిష్టంగా సేవలందించిన కోటపాటి సాంబశివరావు సేవలను కూడా ఈ సందర్భంగా గుర్తిస్తూ ఆయనను ఘనంగా సన్మానించారు. యుఎస్‌ కాంగ్రెస్‌ మెన్‌ స్కాట్‌పెర్రీ, పెన్సిల్వేనియా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటీవ్‌ గ్రెగ్‌ రోత్మన్‌ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని కమ్యూనిటీకి తానా చేస్తున్న సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా జే తాళ్ళూరి మాట్లాడుతూ, తానా 23వ మహాసభలు ఫిలడెల్ఫియాలోని ఫిలడెల్పియా కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కాన్ఫరెన్స్‌కు కన్వీనర్‌గా కార్యదర్శి రవి పొట్లూరి వ్యవహరిస్తారని చెప్పారు. రవి పొట్లూరి మాట్లాడుతూ, సంక్రాంతి వేడుకలను అద్భుతంగా నిర్వహించిన హారీస్‌బర్గ్‌ టీమ్‌ను అభినందించారు. హరీష్‌ కోయ, రవి మందలపు తదితరులు కూడా ప్రసంగించారు. ఈ వేడుకల నిర్వహణలో సహకరించిన దాతలు, వలంటీర్లు, కో ఆర్డినేటర్లకు సతీష్‌ చుండ్రు ధన్యవాదాలు తెలిపారు. గ్రాండ్‌ స్పాన్సర్‌గా వ్యవహరించిన పరివార్‌కు చెందిన సాంబు అంచకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. 

సూపర్‌ సింగర్‌ అంజనా సౌమ్య, ధీరజ్‌ ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి అందరినీ అలరించింది. హీరోయిన్‌ అంకిత చేసిన డ్యాన్స్‌ కనువిందు చేసింది. శ్రీలక్ష్మీకులకర్ణి ఎంసిగా వ్యవహరించింది. తానా అధ్యక్షుడు జే తాళ్ళూరితోపాటు బోర్డ్‌ చైర్మన్‌ హరీష్‌ కోయ, సెక్రటరీ రవి పొట్లూరి, ఫౌండేషన్‌ సెక్రటరీ రవి మందలపు, ఫౌండేషన్‌ ట్రస్టీ రావు యలమంచిలి, పాఠశాల నేషనల్‌ చైర్‌ నాగరాజు నలజుల, ఇసి సభ్యులు సతీష్‌ చుండ్రు, సుమంత్‌ రామిసెట్టి, శ్రీ అట్లూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తానా మిడ్‌ అట్లాంటిక్‌ టీమ్‌కు చెందిన సతీష్‌ చుండ్రు, వెంకట్‌ సింగు, సాంబు అంచ, కిషోర్‌ కొంక, శ్రీనివాస్‌ కాకర్ల, సాంబ నిమ్మగడ్డ, సతీష్‌, లక్ష్మణ్‌ బెల్లం, హిమబిందు కోడూరు, బాబు, రాంబాబు కావూరి, వెంకట్‌ చిమ్మిలి, సందీప్‌ మామునూరి, వేణు మక్కెన, శ్రీనివాస్‌ కోట, మధు, నాగార్జున, నవీన్‌ తొక్కల, రాజు గుండాల, సునీల్‌ పొందూరి, వంశీ ముప్పాల, వెంకట్‌ ముప్ప, ఉపేంద్ర దేవినేని, రాము కరణం, చంద్ర వీరెళ్ళ, రాము చెరుకుమల్లి, ప్రవీణ్‌ జంపన, అశోక్‌, వెంకట్రావు నెల్లూరి, చందు వల్లూరి, నాగార్జున నలజుల, సాంబయ్య కోటపాటి, సాయి జరుగుల, మోహన్‌, సంతోష్‌, సునీల్‌ కోగంటి, గోపి, వేణు, శ్రీలక్ష్మీ, కృష్ణ, రంజిత్‌ మామిడి, సరోజ పావులూరి, ఫణి కంతేటి, రాజేశ్వరి తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు. కార్యక్రమాన్ని లైవ్‌ టెలికాస్ట్‌ చేసిన సదా భరత, ఫోటోలను తీసిన ఆత్రేల సింధిరి, శ్రీనివాస్‌ బండికి కూడా సతీష్‌ చుండ్రు ధన్యవాదాలు తెలిపారు 

Click here for Event Gallery

 

Tags :