కప్పట్రాళ్లలో తానా ఆధ్వర్యంలో సంక్రాతి సంబరాలు
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జనవరి 12 వ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, కార్యదర్శి రవి పొట్లూరి తెలియజేసారు.
ఈ సంబరాలకు ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం, విశిష్ట అతిధులుగా ఎంపీలు శ్రీ టీజీ వెంకటేష్, శ్రీ సంజీవ్ కుమార్ హాజరవుతున్నారు. దేవి యాడ్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా ఈ సంబరాలకు తమ సహకారాన్ని అందజేస్తున్నాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా పురుషులకు, మహిళలకు, విద్యార్థులకు 21 విభాగాలలో ఆటలపోటీలు నిర్వహించనున్నట్లు కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ తెలియజేసారు.
Tags :